త్వరలో అతిథి శంకర్‌ వివాహం

May 13,2024 21:35 #adithi sankar, #movie

కోలీవుడ్‌ హీరోయిన్‌ అతిథి శంకర్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆమె స్టార్‌ దర్శకుడు శంకర్‌ కుమార్తె. డాక్టర్‌ కాబోయి ఆమె యాక్టర్‌ అయిన విషయం తెలిసిందే. ‘విరుమాన్‌’ చిత్రంలో కార్తీకి జంటగా నటించి తొలి విజయాన్ని అందుకున్నారీమె. అదే చిత్రంలో పాట పాడి గాయనిగాను ప్రశంసలు పొందారు. ఆ తర్వాత శివ కార్తికేయన్‌ సరసన ‘మావీరన్‌’ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా విజయాన్ని సాధించింది. ఈమెకు సక్సెస్‌ అందించింది. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో నటుడు ఆకాష్‌ మురళికి జంటగా నటిస్తున్నారు.

➡️