పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో తుదిషెడ్యూల్‌ను తెరకెక్కించేందుకు నిర్మాత ఎఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. హాలీవుడ్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్ర యూనిట్ అక్టోబర్‌లో తెరకెక్కించింది. 500 మంది వరకూ ఈ షూట్‌లో పాల్గొన్నారు. ఆఖరి షెడ్యూల్ శని, ఆదివారాల్లో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్‌లో కూడా భారీ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. పవన్‌కళ్యాణ్‌తోపాటుగా 200 మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తికానుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అనుపమ్‌ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరా, తోట తరణి కళా దర్శకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ సాంకేతిక, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందజేస్తున్నారు. ఎఎం రత్నం సమర్పణలోనే మెగా సూర్యప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్‌కళ్యాణ్ యోధుడిగా ఈ సినిమాలో నటిస్తున్నారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.