పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన చిత్రం ‘హరి హరి వీరమల్లు’. చిత్ర నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. డబ్బింగ్, విఎఫ్‌ఎక్స్ పనులు కొనసాగుతున్నాయి. ప్రేమ్‌లకు సొబగులు అద్దుతూ, సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మంచి చిత్రంగా చేయటానికి చిత్ర యూనిట్ కృషిచేస్తోంది. ఈ వేసవిలో ఎండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నామని చిత్రబృందం పేర్కొంది. దర్శకుడు ఎఎం జ్యోతికృష్ణ గత ఏడునెలలుగా కృషిచేస్తున్నారు. అన్ని విభాగాలను ఆయన సమన్వయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చేయడంలో జ్యోతి కష్ణ పాత్ర కీలకం. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్‌కళ్యాణ్ కనువిందు చేయబోతున్నారు. మే 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, ఎఎం జ్యోతికృష్ణ దర్శకులు. ఎఎం కీరవాణి సంగీతం. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్. బాబీడియోల్, అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషుసేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు.
