థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ ఫైట్లతో ‘కెప్టెన్ అమెరికా : బ్రేవ్ న్యూ వరల్డ్’ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసియు) సిరీస్ ద్వారా వస్తున్న ఆరో భాగం ఇది. నటుడు హారిసన్‌ఫోర్డ్ ఇందులో రెడ్‌హల్క్ పాత్రలో నటిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ చిత్రం నుంచి హారిసన్‌ఫోర్డ్ పాత్రను పరిచయం చేశారు. ఈనెల 14న హిందీ, ఇంగ్లీషుతోపాటు దక్షిణాది బాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. జూలియస్ ఓనా దర్శకత్వం వహిం చారు. ఆంథోనీ మాకీ, డానీ రామిరేజ్, షిరా హాస్, జోషా రోక్మోర్, కార్ల్ లంబ్లీ, లివ్ టైలర్, టిమ్ బ్లేక్ నెల్సన్ నటించారు.
