శుక్రవారంనాడు థియేటర్లలో ఎక్కువగా చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాల విడుదలలు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ వారం చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్, లవ్ యాక్షన్, హిస్టారిక్ డ్రామా జోనర్లలో ఉన్నాయి.
‘కోర్ట్ : స్టేట్ వర్సెస్ ఎ నోబడీ : ప్రియదర్శి ప్రధాన పాత్రలో కథానాయకుడు నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్‌పోస్టర్స్ సినిమాస్ బ్యానర్‌లో వస్తోన్న సినిమా ఇది. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ప్రియదర్శి లాయర్ పాత్రలో నటిస్తుండగా శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్థన్, హర్ష్‌రోషన్, శ్రీదేవి కీలకపాత్రల్లో నటించారు.
దిల్ రూబా : కిరణ్ అబ్బవరం, రుక్సన్ థిల్లాన్ జంటగా విశ్వకరుణ్ రూపొందించిన చిత్రం ఇది. రవి, జోజోజోస్, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మించారు. యాక్షన్, లవ్ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ‘క’ చిత్రం తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ఇదే.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ : మలయాళంలో వచ్చిన లేటెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైంది. కుంచాకో బోబన్, ప్రియమణి, జగదీశ్, విశాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడ హిట్ టాక్‌ను అందుకోవటంతో తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు.
ది డిప్లొమాట్ : పాకిస్తాన్ నుంచి ఓ భారతీయ యువతిని స్వదేశానికి రప్పించటానికి భారతీయ దౌత్యవేత్త (జేపీ సింగ్) నిజమైన కథ ఆధారంగా రూపొందిన చిత్రం. జేపీ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం నటిచంఆరు. సాదియా, కుముద్ మిశ్రా, రేవతి ప్రధాన పాత్రలు పోషించారు.
కేసరి వీర్ : లెజెండ్ ఆఫ్ సోమనాథ్ : బాలీవుడ్ కథానాయకుడు సూరజ్ పంచోలి నటించిన ‘కేసరి వీర్ : లెజెండ్ ఆఫ్ సోమ్‌నాథ్. ప్రిన్స్ ధీమాన్ దర్శకత్వం వహించారు. కనుచౌహాన్ నిర్మించారు. సునీల్‌శెట్టి, వివేక్ ఒబెరారు కీలకపాత్రల్లో నటించారు.
1000 వాలా : సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో నూతన యువ నటుడు అమిత్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘1000 వాలా’. షేక్ అఫ్జల్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముక్తార్‌ఖాన్ ముఖ్యపాత్రల్లో నటించారు.