ఘనంగా జరిగిన హీరో అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య వివాహం

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కుమార్తె నటి ఐశ్వర్య వివాహం ఎంతో ఘనంగా జరిగింది. తాను కోరుకున్న వ్యక్తి ఉమాపతితో ఐశ్వర్య వివాహం జూన్‌ 10వ తేదీన జరిగింది. చెన్నైలోని హనుమాన్‌ ఆలయంలో జరిగిన వీరి వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు,అతికొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. జూన్‌ 14న చెన్నై లీలా ప్యాలెస్‌లో రిసెప్షన్‌ జరగనుంది. కాగా, నటుడు దర్శకుడు తంబిరామయ్య కుమారుడే ఉమాపతి. ఈయన కూడా హీరోగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఐశ్వర్య కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ ఆమెకు హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో  గుర్తింపు రాలేదు. ఐశ్వర్య- ఉమాపతిలు   ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ సంగతి పెద్దలకు చెప్పడంతో.. వారు పెళ్లికి అంగీకరించారు. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కారు.

➡️