హీరో ధనుష్‌ రూ.కోటి విరాళం

May 14,2024 19:00 #Dhanush, #movies

కోలీవుడ్‌ హీరో ధనుష్‌ ‘సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ నూతన భవన నిర్మాణం కోసం రూ.కోటి విరాళం అందించారు. చెక్కును నాజర్‌కు అందజేశారు. నటుడు నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ ప్రధాన కార్యదర్శిగా, కార్తి కోశాధికారిగా నడిగర్‌ సంఘం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంఘం నూతన భవన నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళం అందచేశారు. కథానాయకులు కమల్‌ హాసన్‌, విజరు గతంలో దీని కోసం రూ.కోటి చొప్పున విరాళంగా ఇచ్చారు. హీరో శివ కార్తికేయన్‌ రూ.50 లక్షలు అందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరులో ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.

➡️