మెగాస్టార్‌ చిరంజీవితో హీరో నాని సినిమా

Dec 4,2024 13:09 #chiru, #movie, #nani

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవితో హీరో నాని ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని నానినే స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్నారు. గతకొన్నిరోజులుగా నాని, చిరు కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ.. తాజాగా ఈ చిత్ర బృందం పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. రక్తం కారుతున్న చిరు చేయితో ఉన్న ఈ పోస్టర్‌ని చూడగానే.. మాస్‌ ప్రేక్షకులకు ఏమాత్రం నిరాశ కలిగించదు అన్న స్థాయిలోనే సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

 

➡️