మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆయన హీరో మాత్రమే కాదు అందరినీ మెప్పించే విలన్ కూడా.. టాలీవుడ్,కోలీవుడ్‌లో తన నటనతో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు. ఆయనకు పాత్ర నచ్చితే చాలు గ్రీన్ సిగల్ ఇచ్చేస్తారట. అందుకే విజరు సేతుపతికి ఇండిస్టీతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు మలేషియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా విజరు సేతుపతి తన అభిమాని పెళ్లికి హాజరయ్యారు. ఆయన రాకతో పెళ్లికి వచ్చిన అతిథిలు అందరూ ఆశ్చర్యపోయారు. మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌కు చెందిన జయబాస్,జయపాల్ ఇద్దరూ విజరు సేతుపతికి అభిమానులు. విజయ్ సేతుపతి జిల్లా అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా ఒకరు ఉంటే మరోకరు జిల్లా ఉప కార్యదర్శిగా ఉన్నారు. అందుకే పెళ్లికి హాజరయ్యారు.
