హాలీవుడ్‌ నటుడు జాన్‌ అమోస్‌ కన్నుమూత

హాలీవుడ్‌ నటుడు జాన్‌ అమోస్‌ (84) కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన చనిపోయారు. ఆగస్టు 21నే ఆయన చనిపోగా మంగళవారం రాత్రి విషయం బయటకు వచ్చింది. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా వారితో విడాకులు అయ్యాయి. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1939 డిసెంబర్‌ 27న ఆయన జన్మించారు. 1971లో సినిమా కెరీర్‌ను ప్రారంభించారు. 2023 వరకూ వివిధ సినిమాలు, టీవీ సిరీస్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చారు. 1977లో వచ్చిన రూట్స్‌, గుడ్‌టైమ్స్‌ అనే సిరీస్‌లతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయారు. ఇప్పటివరకూ 50కుపైగా సినిమాల్లో నటించారు. 100కుపైగా సీరియళ్లు, సిరీస్‌లలో నటించారు. చివరిగా 2023లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘ది లాస్ట్‌ పైఫిల్‌ మ్యాన్‌’ సినిమాలో నటించారు. 2022లో ‘ ది రైటోస్‌ జెమ్‌ స్టోన్స్‌’ సిరీస్‌లోనూ నటించారు. అమెరికాలో ఆయనకు టివి డాడ్‌గా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. అమోస్‌ మృతికి పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.

➡️