‘వార్‌ 2’లో హృతిక్‌కు గాయాలు

Mar 11,2025 20:59 #hrithik roshan, #injured, #war 2

ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న సినిమా ‘వార్‌ 2’ షూటింగ్‌ కొనసాగుతోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఒక పాట కోసం షూటింగ్‌ జరుగుతోంది. రిహార్సల్స్‌ చేస్తుండగా హృతిక్‌ గాయపడ్డారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య కొన్ని భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారు. ఫైనల్‌ సాంగ్‌ కోసం ముంబైలోని యశ్‌రాజ్‌ స్టూడియోస్‌లో ఏర్పాటుచేసిన భారీ సెట్‌లో వీరితోపాటుగా 500 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. హృతిక్‌కు గాయాలు కాగా ఆసుపత్రిలో చేర్పించారు. షూటింగ్‌ ఆగిపోయింది. డాక్టర్ల సూచనల మేరకు ఆయన నెల రోజులపాటు విశ్రాంతి తీసుకోబోతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సంఘటనతో సినిమా షూటింగ్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వైఆర్‌ఎఫ్‌ (యశ్‌రాజ్‌ ఫిలింస్‌) స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్‌ మూవీ ‘వార్‌’కి సీక్వెల్‌గా ‘వార్‌ 2’ రూపొందుతోంది. ఇందులో జాన్‌ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

➡️