ప్రకాష్, విక్రమ్, ప్రసన్న, స్రవంతి నటిస్తున్న కొత్త సినిమా ‘ఆకలి’. కళింగ ఆర్ట్స్ క్రియేషన్స్‌పై బ్యానర్‌పై గూన అప్పారావు దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని పాల పోలమ్మ గుడి ఆవరణలో ఈ సినిమా షూటింగ్‌ను శాసనసభ్యులు కూన రవికుమార్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తుందన్నారు. సనపల అన్నాజీరావు, జమ్మిడి కృష్ణారావు, కుమార్‌నాయక్, దుర్గా వెంకటగిరి, మోహనరావు, వెంకట్రావు తారాగణం షూటింగ్‌లో పాల్గొన్నారు. గత రెండు రోజులుగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది.
