తెలంగాణ : ” తెలంగాణ కల్చర్‌ని అభిమానిస్తాను.. నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి ” అని సినీ నిర్మాత దిల్ రాజు శనివారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ”నిజామాబాద్ జిల్లా వాసిగా నా సినిమా ఈవెంట్ అక్కడ చేశా. ఆ ఈవెంట్‌లో నేను మన సంస్కఅతిలో ఉండే దావత్ గురించి మాట్లాడాను. తెలంగాణ వాళ్లను నేను అవమానించానని, హేళన చేశానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సంస్కఅతిని నేను అభిమానిస్తాను. బాన్సువాడలోనే ‘ఫిదా’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆ సినిమా తెలంగాణ సంస్కఅతిని ప్రపంచవ్యాప్తం చేసింది. ‘బలగం’ చిత్రాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించింది. అన్ని రాజకీయ పార్టీలు ‘బలగం’ చిత్రాన్ని అభినందించారు. తెలంగాణ వాసిగా నేను ఏవిధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను.. తెలంగాణ కల్చర్‌ని అభిమానిస్తాను.. నా మాటల వల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి.. నా మాటల్లోని కమ్యూనికేషన్‌లో ఏదైనా తప్పుగా అర్థమయ్యి ఉంటే నన్ను క్షమించండి.. మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎవరైతే అనుకుంటున్నారో వారు నన్ను క్షమించండి.” అని దిల్ రాజు వివరణ ఇచ్చారు.