” ఇలాంటి గొప్ప విజయాన్ని నేను అస్సలు ఊహించలేదు ” : మిథున్‌ చక్రవర్తి

ముంబయి : ” ఇలాంటి గొప్ప విజయాన్ని నేను అస్సలు ఊహించలేదు ” అని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి (74) హర్షాన్ని వ్యక్తం చేశారు. మిథున్‌ చక్రవర్తిని దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించనున్నదని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఎక్స్‌ ద్వారా వెల్లడించిన సంగతి విదితమే. అక్టోబర్‌ 8వ తేదీన జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ అవార్డును మిథున్‌ చక్రవర్తికి అందజేయనున్నారు. దీనిపై మిథున్‌ చక్రవర్తి స్పందిస్తూ …. ” మాటలు రావడం లేదు. ఇలాంటి గొప్ప విజయాన్ని నేను అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉన్నా. నా కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు దీనిని అంకితం చేస్తున్నా ” అని అన్నారు.

➡️