బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామ్ నగర్ బన్నీ’. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో చంద్రహాస్ మాట్లాడుతూ, ‘మూడు ప్రామిస్‌లు చేస్తున్నా. నేను మాట ఇస్తే తప్పను. నా ”రామ్ నగర్ బన్నీ” సినిమా లాభాల్లో 10 శాతం ప్రజలకు ఛారిటీ కోసం ఇచ్చేస్తా. సినిమా చూసి ఆటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్‌కు నేను అర్హుడిని కాదంటే నా నెక్స్ట్ రెండు సినిమాలకు ఆ పేరు పెట్టుకోను. అలాగే మా సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోస్ ఇన్‌స్టా ద్వారా చెప్పండి. మీ డబ్బులు గూగుల్ పే చేస్తా. ఎంతమంది పంపితే అంతమందికి డబ్బులు రిటర్న్ ఇస్తా. మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటా. ఈ సినిమాను నేనంటే నచ్చేవాళ్లతో పాటు నచ్చనివాళ్లు కూడా చూడండి. మీరు నాలో నెగిటివ్ చెబితే నెక్ట్ మూవీకి మార్చుకుంటా. నా ప్రతి మూవీకి నా బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. గత రెండేళ్లలో నా గురించి ఎంతో నెగిటివ్‌గా చెప్పారు. నేను అవన్నీ పాజిటివ్‌గా తీసుకున్నా. నన్ను విమర్శిస్తే బాధపడను’ అని అన్నారు.