IIFA 2024 ‘ఐఫా’ అవార్డులు – ‘యానిమల్‌’ హవా – ఉత్తమ నటుడిగా షారుక్‌

అబుదాబి : భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డుల కార్యక్రమం అబుదాబి వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తొలిరోజు దక్షిణాది చిత్రపరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులను అవార్డులు వరించాయి. రెండో రోజు బాలీవుడ్‌ సినిమాలకు, నటీనటులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో ‘యానిమల్‌’ హవా కనిపించింది. వివిధ విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ‘జవాన్‌’ చిత్రానికి షారుక్‌ ఖాన్‌ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.

ఐఫా 2024 విజేతలు వీరే :
ఉత్తమ చిత్రం : యానిమల్‌
ఉత్తమ నటుడు : షారుక్‌ ఖాన్‌ (జవాన్‌)
ఉత్తమ నటి : రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే)
ఉత్తమ దర్శకుడు : విదు వినోద్‌ చోప్రా (12 th ఫెయిల్‌)
ఉత్తమ సహాయ నటుడు : అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)
ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ )
ఉత్తమ విలన్‌: బాబీ దేవోల్‌ (యానిమల్‌)
ఉత్తమ కథ: రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ
ఉత్తమ కథ : 12 th ఫెయిల్‌
ఉత్తమ సంగీతం : యానిమల్‌
ఉత్తమ లిరికల్స్‌ : యానిమల్‌ (సిద్ధార్థ్‌-గరిమే, సత్రన్యాగ)
ఉత్తమ గాయకుడు : భూపిందర్‌ బబ్బల్‌, అర్జన్‌ వ్యాలీ (యానిమల్‌)
ఉత్తమ గాయని : శిల్పారావు (చెలియా-జవాన్‌)
ఔట్‌ స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా : జయంతిలాల్‌, హేమా మాలిని
అచీవ్‌మెంట్‌ ఆన్‌ కంప్లీటింగ్‌ 25 ఇయర్స్‌ ఇన్‌ సినిమా : కరణ్‌ జోహార్‌

➡️