జైపూర్ : ‘ఐఫా’ అవార్డ్స్ 2025 ‘ వేడుకలు జైపూర్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు అలరించనున్న ఈ ఐఫా సిల్వర్ జూబ్లీ వేడుకలు శనివారం మొదలయ్యాయి. తొలి రోజు డిజిటల్ అవార్డుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, డిప్యూటీ సీఎం దియా కుమారితోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గన్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్, షాహిద్ కపూర్, కృతి సనన్, కరీనా కపూర్, శ్రేయా ఘోషల్, కరణ్ జోహార్, బాబీ డియోల్ ఐఫా వేదికపై సందడి చేశారు. ఆదివారం సాయంత్రం జరగనున్న వేడుకలో చిత్ర రంగానికి సంబంధించి అవార్డులు అందజేయనున్నారు.
మగవారితో సమానంగా పనిచేస్తున్నా… పారితోషికంలో వ్యత్యాసం ఎందుకు ? : గళమెత్తిన తారలు
చిత్రసీమకు చెందిన చాలామంది నటీమణులు ‘ది జర్నీ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమా’ పేరుతో జరిగిన చర్చలో తమ వాయిస్‌ను వినిపించారు. పరిశ్రమలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సినిమాకు సంబంధించి హీరోల్లాగే తాము కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నామని వారంతా తెలిపారు. ఇక్కడ అందరం సమానంగా పనిచేసినప్పటికీ పారితోషికం విషయంలో చాలా వ్యత్యాసం కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నటులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని సూచించారు. ‘స్త్రీ2’ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలాంటప్పుడు ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలిసిందే అంటూ బాలీవుడ్ కథానాయకులు తమ గళాన్ని వినిపించారు.
సినిమా విభాగం :
ఉత్తమ చిత్రం: అమర్ సింగ్ చంకిలా
ఉత్తమ నటి : కృతి సనన్ (దో పట్టి)
ఉత్తమ నటుడు : విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)
ఉత్తమ దర్శకుడు : ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకిలా)
ఉత్తమ సహాయ నటి : అనుప్రియ గోయెంకా (బెర్లిన్)
ఉత్తమ సహాయ నటుడు : దీపక్ దోబ్రియాల్ (సెక్టార్ 36)
ఉత్తమ కథ ఒరిజినల్ : కనికా ధిల్లాన్ (దో పట్టి)
వెబ్ సిరీస్ విభాగం :
ఉత్తమ సిరీస్ : పంచాయత్ సీజన్- 3
ఉత్తమ నటి (సిరీస్) : శ్రేయ చౌదరి (బాండిష్ బాండిట్స్ సీజన్ 2)
ఉత్తమ నటుడు (సిరీస్) : జితేంద్ర కుమార్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ దర్శకుడు (సిరీస్) : దీపక్ కుమార్ మిశ్రా (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటి (సిరీస్) : సంజీదా షేక్ (హీరామండి: ది డైమండ్ బజార్)
ఉత్తమ సహాయ నటుడు (సిరీస్) : ఫైసల్ మాలిక్ (పంచాయత్ సీజన్ 3)
ఉత్తమ కథ : కోటా ఫ్యాక్టరీ సీజన్ 3