అజిత్ హీరోగా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘గుడ్ బ్యడ్ అగ్లీ’.. ఈ యాక్షన్ కామెడీ మూవీ ఈ నెల 10న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ మేకర్స్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. గతంలో తాను స్వరాలు సమకూర్చిన మూడు గీతాలను ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అనుమతి లేకుండా రీ క్రియేట్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకుగానూ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేశారు. వెంటనే ఆ సాంగ్స్‌ను తొలగించి.. మేకర్స్ క్షమాపణ చెప్పాలని కోరారు.
