వరుస సీక్వెల్స్‌లో …

Apr 4,2024 19:15 #ajay devagan, #movie, #released

బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవగణ్‌ ఎనిమిది సీక్వెల్స్‌లో నటించేందుకు సిద్థమవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల జాబితాలో ఎక్కువగా సీక్వెల్స్‌ ఉన్నాయి. రాజ్‌కుమార్‌ గుప్త దర్శకత్వంలో ‘రైడ్‌’ మూవీ కొనసాగింపుగా ‘రైడ్‌ 2’ రాబోతోంది. వాణీకపూర్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సింగం అగైన్‌’ ఇప్పటికే సెట్స్‌పై ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఆగస్టులో విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ‘గోల్‌మాల్‌ 4’, ‘గోల్‌మాల్‌-5’లకు సంబంధించి కూడా స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి ‘దే దే ప్యార్‌ దే-2’ రాబోతోంది. ఇందులో వయసు అంతరం ఉన్న ప్రేమికుడిగా మరోసారి అలరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’కు కొనసాగింపుగా మరో మూవీ పట్టాలెక్కనుంది. వర్తమానంలో జరిగే కథతో ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 3’ని దర్శకుడు జీతూ జోసెఫ్‌ రెడీ చేస్తున్నారు.

➡️