‘భారతీయుడు’ మూడో భాగం కూడా!

May 16,2024 19:56 #Kamal Haasan, #movies

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’. ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రానుంది. తాజాగా ఓ అప్డేట్‌ కూడా బయటికి వచ్చింది. ఈ చిత్రానికి మూడో భాగం కూడా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్‌ 2తో పాటే మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు సినిమాలను ఏడాదిలోపే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. పార్ట్‌2 క్లైమాక్స్‌లో మూడో భాగం ట్రైలర్‌ను ప్రదర్శించాలని, అప్పుడే పార్ట్‌ 3 విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయికలు. ‘భారతీయుడు 2’ ట్రైలర్‌ రిలీజ్‌ కోసం యూనిట్‌ ఓ భారీ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. ఇప్పటికే ఆ పనులు పూర్తయ్యాయి.

➡️