‘పరదా’లో మరో హీరోయిన్‌

Jun 17,2024 18:15 #New Movies Updates

అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’. ఈ సినిమాకు ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీధర్‌ మక్కువ, విజరు డొంకాడ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న మరో కథానాయికను చిత్రబృందం పరిచయం చేసింది. ఈ సినిమాలో మలయాళ నటి దర్శన రాజేంద్రన్‌ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. సంప్రదాయపు కట్టుబాట్లను దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది. అమిష్త అనే పాత్రలో దర్శన కనిపించనుంది.

➡️