‘గద్దర్‌’ అవార్డులకు ఆహ్వానాలు

Mar 11,2025 20:20 #Gaddar Awards, #in Telangana, #movies

2014 నుంచి 2023 వరకూ ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి అవార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు గద్దర్‌ అవార్డులను ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవార్డులకు సంబంధించిన విధి విధానాలను తాజాగా ఖరారు చేసింది. మార్చి 13వ తేదీ నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనుంది. ఫీచర్‌ ఫిల్మ్‌, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలనచిత్రం విభాగం, పర్యావరణం, హెరిటేజ్‌, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేయనున్నారు. తొలి ఫీచర్‌ ఫిల్మ్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌, సోషల్‌ ఎఫెక్ట్‌ ఫిల్మ్‌, డాక్యుమెంటరీ ఫిల్మ్‌, షార్ట్‌ ఫిల్మ్‌ విభాగాల్లోనూ ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. తెలుగు సినిమాపై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకూ ఈ అవార్డును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

➡️