రూపాన్ని బట్టి  మనుషుల్ని అంచనా వేయడం సరైంది కాదు : నిత్యామేనన్‌

Apr 14,2025 07:34 #Film Industry, #Nithya Menon

శారీరక రూపాన్ని బట్టి  మనుషుల్ని అంచనా వేయడమనేది సరియైన ఆలోచన కాదని ప్రముఖ నటి నిత్యామేనన్‌ పేర్కొన్నది. ప్రస్తుతం ధనుష్ తో ఇడ్లీ కడై అను సినిమాలో షూటింగ్ ఆమె బిజీగా ఉన్నారు. తన రూపాన్ని మార్చుకోమని ఎంతో మంది విమర్శించారని తెలిపారు. ‘‘పాఠశాల, కళాశాల రోజుల నుంచే నా జుట్టుతో ఎప్పుడూ సమస్య ఉండేది. నా మొదటి సినిమా చేస్తున్నప్పుడు కొందరు ‘‘ఈ జుట్టు ఏమిటి? ఇది చాలా వింతగా ఉంది’’ అని అన్నారు. కానీ ఇప్పుడు అందరూ ఈ రింగుల జుట్టునే ఇష్టపడతారు. కానీ ఆ రోజుల్లో ఇది అందరికీ ఓ వింతలా కనిపించింది. మీరు చాలా పొట్టిగా, లావుగా, మీ కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయి’.. ఇలాంటి మాటలు కూడా నాకు ఎదురయ్యాయి. ఈ మాటలు నన్ను చాలా ప్రభావితం చేస్తుంటాయి. ప్రభావితం చేయాలి కూడా. అప్పుడే మీరు ఆ సవాళ్లను ఎదుర్కొగలరు. కానీ ఎన్ని విమర్శలు ఎదురైనా ఎప్పుడూ నా రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించలేదు. నాలాగే ఉండి నేనెంటో నిరూపించుకోవాలనుకున్నానని” పేర్కొన్నారు.

➡️