తెలంగాణ : సినీ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. ఆమె నివాసంలో లాకర్స్ తో పాటు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుండి దిల్ రాజు కుమార్తె హన్షితా రెడ్డి నివాసంలో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఆమె నివాసంలో రైడ్స్ ముగించుకుని ఐటీ అధికారులు వెళ్ళిపోయారు. నిన్న ఉదయం దిల్ రాజు కుమార్తె ఇంటికి నాలుగు ఐటి బృందాలు చేరుకున్నాయి. అప్పటినుంచి ఆమె నివాసంలో రైట్స్ జరుగుతూనే ఉన్నాయి. నిన్న రాత్రి అంతా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మరొక టీం ఈ సోదాల్లో జాయిన్ అయింది. ఇక నిన్న దిల్ రాజు కుమార్తె ఆమె నివాసంలో లేకపోయినా సరే రెయిడ్స్ మాత్రం జరిగాయి. దిల్ రాజు భార్య ఉంటున్న నివాసంలో కూడా ఈ సోదాలు నిర్వహించారు అధికారులు. ఈరోజు కుమార్తె వచ్చిన తరువాత ఇంట్లో ఉన్న లాకర్లు సోదా చేయడమే కాదు బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు దిల్ రాజు చేసిన మూడు సినిమాల కలెక్షన్స్ వివరాలు కూడా అడిగి తీసుకున్నారు అధికారులు. దిల్ రాజు నిర్మాతగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేయగా డాకు మహారాజ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు.
