జైలర్‌ 2 షూటింగ్‌ మొదలైంది

Mar 10,2025 20:05 #jailer, #movies, #rajinikanth

రజనీకాంత్‌-నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్‌’కు సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. 2023లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీగా నిలిచింది. సన్‌పిక్చర్స్‌ ఈ మూవీ గురించి అప్‌డేట్‌ ఇచ్చింది. ముత్తువేల్‌ పాండియన్‌ వేట ఇప్పుడే ప్రారంభమైందంటూ ఒక పోస్టర్‌ను పంచుకున్నారు. మేకర్లు ఈ విషయాన్ని వెల్లడించటంతో రజనీకాంత్‌ అభిమానులు సంతోషాన్ని వ్యక్తంతచేస్తున్నారు. ‘టైగర్‌ కా హుకుమ్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ‘జైలర్‌ 2’ కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందని కోలీవుడ్‌లో చర్చలు జరుగుతున్నాయి. ‘జైలర్‌’లో నటించిన మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ తదితర ప్రముఖ నటీనటులే సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు. కన్నడ కథానాయిక శ్రీనిధిశెట్టిని ఎంపిక చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తికావటంతో సీక్వెల్‌ను ప్రారంభించారు.

➡️