తమిళనటుడు రజినీకాంత్ నటిస్తున్న సినిమా ‘జైలర్ 2’. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో 2023 ఆగస్టు 10న విడుదలైన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. జైలర్‌లో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, సునీల్, రమ్యకృష్ణ, మీర్ణామీనన్, వినాయకన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ 2026 వేసవిలో విడుదల చేయటానికి మేకర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కేరళలోని అథపాడిలో రజనీకాంత్, ఇతరులపై మేకర్లు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దానికోసం ఇప్పటికే భారీ సెట్లను కూడా నిర్మించారు. మరో 10 నుంచి 20 రోజులపాటు ఈ ప్రాంతంలోనే షూటింగ్ జరగనుంది. కేరళ షెడ్యూల్ ముగిసిన వెంటనే ఫిల్మ్ యూనిట్ చెన్నై రానుంది. రజినీకాంత్ ఫ్యామిలీ సీన్స్, తన మనవడు, రమ్యకృష్ణలపై ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది.
