సుధీర్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. 2025 శివరాత్రికి ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్తపోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లుగా పోస్టర్‌ను చూస్తే అర్థమవుతుంది. సుధీర్‌బాబు సరికొత్త లుక్‌తో శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘జటాధర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయా. ఇంత గొప్ప స్పందన రావడంతో సంతోషమేసింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమాలో అడుగుపెట్టడం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. శాస్త్రీయ, పౌరాణిక అంశాల కలయిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండో జోనర్లుకు చెందిన ప్రపంచాలను ఆడియన్స్ వెండితెరపై చూస్తున్నపుడు ఓ సరికొత్త సినిమా అనుభూతిని పొందుతారు. ఓ సినిమా సక్సెస్‌కైనా కారణం బలమైన స్క్రిప్ట్. దీనికి మంచి టీమ్ తోడైతే అది మంచి అది మంచి సినిమాగా ప్రాణం పోసుకుంటుంది. మా సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది’ అంటూ వివరించారు. సుధీర్‌బాబు నటించిన ‘మా నాన్న’ సూపర్ హీరో సినిమా అక్టోబర్ 11న విడేదల కానుంది.
