మోహన్‌బాబు ఇంటి వద్ద జర్నలిస్టుల ఆందోళన – పోలీసుల మోహరింపు

తెలంగాణ : జల్‌పల్లిలోని సినీనటుడు మోహన్‌బాబు నివాసం వద్ద పలువురు జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులపై దాడికి దిగడంతో మోహన్‌బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ఆయన ఇంటి వద్ద బైఠాయించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈక్రమంలో… అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. నిన్న మోహన్‌బాబు ఇంటి వద్ద జరిగిన ఘర్షణ అనంతరం ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మోహన్‌బాబు వెంట ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఉన్నారు. బుధవారం ఉదయం మోహన్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసే అవకాశముంది. కుటుంబ వివాదం నేపథ్యంలో … నేడు రాచకొండ సీపీ ముందు ఆయన హాజరుకావాల్సి ఉంది. మరోవైపు, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో … పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోహన్‌ బాబు లైసెన్స్‌ తుపాకులను ఫిలింనగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు.

➡️