ఓటేసిన జూ.ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌

May 13,2024 21:25 #jr ntr, #movie

జూనియర్‌ ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌ తమ ఓటుహక్కును హైదరాబాద్‌లో వినియోగించుకున్నారు. తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌.. అందరితో కలిసి క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేశారు. ఉదయాన్నే ఫిలింనగర్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్‌.. క్యూలైన్‌లో నిలుచొని ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, సన్నిహితులైనవారికి మద్దతునిస్తానని చెప్పారు.

➡️