తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రనటుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ త్వరలో హాలీవుడ్‌లోకి ప్రవేశించబోతున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్‌గన్ ఈ మేరకు ప్రకటించటం దీనికి ఊతమిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్‌కు గుర్తింపువచ్చింది. గతంలో రాజమౌళి తీసిన సింహాద్రి, యమదొంగ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ కలిసిలో ఆయన నటిస్తున్నారు. మరోవైపు ప్రశాంత్‌నీల్‌తో కలిసి యాక్షన్ అడ్వెంచర్‌కు కూడా సిద్ధమయ్యారు. హాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు జేమ్స్ గన్ సూపర్‌మ్యాన్, సూసైడ్ స్క్వాడ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వంటి గొప్ప అంతర్జా తీయ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆర్‌ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ చాలా బాగుందంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా ‘బోనుల్లో నుంచి పులులతోపాటు బయటకు దూకిన ఆ నటుడు (ఎన్టీఆర్)తో నేను పనిచేయాలనుకుంటున్నాను. అతను అద్భుత నటుడు. నేను అతనితో ఏదో ఒక రోజు పనిచేయా లనుకుంటున్నాను’ అని అన్నారు. ఇప్పటిదాకా టాప్ హాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ ఓ తెలుగు హీరోనుద్దేశించి మాట్లాడటం ఇదే మొదటిసారి అన్నట్లుగా ఇండిస్టీలో చర్చ జరుగుతోంది.
