ప్రముఖ గాయని, గాన కోకిల పి.సుశీలకు ‘కలైజ్ఞర్’ స్మారక కళా విభాగం స్పెషలిస్ట్’ అవార్డును తమిళనాడు ప్రభుత్వం ప్రకటించించింది. డిఎంకె అధినేత కరుణానిధి పేరిట తమిళనాడు ప్రభుత్వం తమిళాభివృద్ధి విభాగం నేతృత్వంలో కలైజ్ఞర్ నినైవు కళై తురై విత్తగర్ అవార్డును (కలెజ్ఞర్ స్మారక కళా విభాగం స్పెషలిస్టు లేదా నిపుణులు) ఒకరికి ప్రధానం చేయటానికి 2022లో నిర్ణయించారు. మొదటి అవార్డు తిరువారూర్ ఆరూర్దాస్‌కు దక్కింది. గతేడాది మొత్తం కరుణానిధి శతజయంతి ఉత్సవాలు జరగటంతో ఈ అవార్డును 2023కుగాను మహిళా ప్రముఖురాలికి ప్రధానం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ అవార్డుకు పి.సుశీలను ఎంపిక చేశారు. తమిళ బాషాభివృద్ధికి శ్రమిస్తున్న రచయిత, కవి మహ్మద్ మెహతాను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 30న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతులమీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
