పోరాటాలతో ‘కల్కి’ ట్ర్రైలర్‌

హీరో ప్రభాస్‌ నటించిన తాజా సినిమా ‘కల్కి 2898 ఎడి’. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. వైజయంతి మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకోన్‌,దిశా పాటని, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్‌తో సాగే ఈ ట్రైలర్‌లో యాక్షన్‌కు దర్శకులు పెద్దపీట వేశారు. ఓ అమ్మాయి కోసం అశ్వధ్ధామ (అమితాబ్‌ బచ్చన్‌) చేసే పోరాటానికి భైరవ (ప్రభాస్‌) అడ్డుగా వెళ్తాడు. ‘కావాలంటే రికార్డులు చూసుకో.. ఇప్పటి వరకూ ఒక్క ఫైట్‌ కూడా ఓడిపోయలేదు, ఇది కూడా ఓడిపోను’ అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది. కమల్‌ హాసన్‌ పాత్రని కూడా ట్రైలర్‌లోనే పరిచయం చేశారు. సైన్స్‌ ఫిక్షన్‌, ఫాంటసీ కథలు ఇష్టపడేవాళ్లకు, యాక్షన్‌ ప్రియులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. కాగా ఈ సినిమాను మేకర్స్‌ ఈనెల 27న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

➡️