‘ఎఐ’తో కమల్‌ 237వ సినిమా

Apr 14,2025 20:24 #ai movie, #Kamal Haasan, #movies

సినిమా జయాప జయాలతో పనిలేకుండా కథలో వైవిధ్యం ఉంటే ఓకే చెప్పే నటుడు కమల్‌హాసన్‌. ఇటీవల ‘విక్రమ్‌’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను ఆయన అందుకున్నారు. నిర్మాతగా ‘అమరన్‌’ చిత్రంతో మరో ఘన విజయాన్ని పొందారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థక్‌లైఫ్‌’ చేశారు. నటుడు శింబు ముఖ్యపాత్రను పోషించిన ఈ చిత్రంలో త్రిష కథానాయిక. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా జూన్‌ 5న విడుదల కానుంది. నాయకన్‌ (నాయకుడు) తర్వాత మణిరత్నం- కమల్‌హాసన్‌ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కమల్‌హాసన్‌ తన 237వ చిత్రానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఫైట్‌మాస్టర్లు అన్‌ అన్బరివ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఇది పూర్తిగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సమాచారం. ఈ సినిమా కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎఐ టెక్నాలజీ నేర్చుకుని వచ్చారు. ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈనెలఖరు నుంచి ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో మరో సినిమాలో కమల్‌ నటించబోతున్నారు.

➡️