97వ ఆస్కార్ బరిలో సత్తా చాటేందుకు దక్షిణాది నుండి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్ధమయ్యాయి. వాటిల్లో సూర్య ‘కంగువా’ ఆస్కార్ బరిలోకి నిలిచింది. దీంతో పాటు పృథ్వి రాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్ లైఫ్’ కూడా ఆస్కార్‌లోకి ఎంట్రీ దక్కించుకుంది. ఇండియా నుంచి ప్రస్తుతం ఆస్కార్ 2025 కోసం షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ‘ఆడు జీవితం’, ‘కంగువా’ ‘సంతోష్’, ‘స్వాతంత్య్ర వీర సావర్కర్’ ,’ఆల్ వురు ఇమాజిన్ యాజ్ లైట్'(మలయాళం) చిత్రాలు ఉన్నాయి. షార్ట్ లిస్ట్ అయిన సినిమా నుంచి ఆస్కార్ ఫైనల్ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్లను అనౌన్స్ చేస్తారు.