‘కంగువ’లో ఏఐ టెక్నాలజీ

Oct 14,2024 19:10 #'AI' effect, #hero surya, #kanguva, #movies

తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువ’. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెంచ్‌, ఇంగ్లీష్‌, స్పానిష్‌ బాషల్లో విడుదల చేయబోతున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఈనెల 10న విడుదల చేయాల్సివుంది. రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ సినిమా అదేరోజు విడుదల కావటంతో వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఎక్స్‌ (ట్విట్టర్‌)లో నెటిజన్లతో కంగువ నిర్మాత కేజీ జ్ఞానవేల్‌ ముచ్చడించారు. ‘కంగువ’ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించినట్లు చెప్పారు. తమిళం వరకూ సూర్య డబ్బింగ్‌ చెప్పగా…మిగతా భాషల్లో మాత్రం ఏఐ సహాయంతో పూర్తిచేస్తామన్నారు. తమిళ ఇండిస్టీలో ఇలా ఏఐ టెక్నాలజీ ఉపయోగించటం ఇదే మొదటిసారి. ‘కంగువ’ విషయానికొస్తే కంగ అనే ఓ యోధుడి జీవితమే స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య దాదాపు ఆరు గెటప్స్‌లో కనిపిస్తాడని సమాచారం. బాలీవుడ్‌కు చెందిన దిశా పఠానీ హీరోయిన్‌. బాబీడియోల్‌ విలన్‌. జగపతిబాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలకపాత్రలు చేశారు.

➡️