హత్య కేసులో కన్నడ హీరో అరెస్ట్‌

Jun 11,2024 19:25 #darsan, #movie

ఒక హత్యకేసులో కన్నడ సినీ హీరో దర్శన్‌ను బెంగుళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఈ ఉదయం మైసూరులోని ఫాం హౌస్‌ నుండి దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని, రెండు రోజుల క్రితం హత్య కేసు నమోదైందని పోలీసులు పేర్కొన్నారు. దర్శన్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిసిపి) నిర్థారించారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 8న రేణుకాస్వామి హత్యకు గురయ్యారు. ఆ మరుసటి రోజు కామాక్షిపాళ్యం సమీపంలోని ఒక కాలువలో మీతదేహం కనిపించింది. మఅతుడిది చిత్రదుర్గమని, ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కేసులో దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. హీరో దర్శన్‌ సూచనతోనే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. దీంతో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్శన్‌కు సన్నిహితురాలైన మరో నటికి రేణుకా స్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు పోలీసులు తెలిపారు.

➡️