కేన్స్‌లో ‘కన్నప్ప’ టీమ్‌

May 21,2024 19:30 #Manchu Vishnu, #movie

మంచు విష్ణు, మోహన్‌ బాబు టీం నుంచి వస్తోన్న తొలి పాన్‌ ఇండియా సినిమా ‘కన్నప్ప’. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా కన్నప్ప టీం కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఈ చిత్ర టీజర్‌ స్పెషల్‌ స్క్రీనింగ్‌ని కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. విష్ణు, మోహన్‌ బాబు, ప్రభుదేవా, వెరోనికా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. తాజా అప్‌డేట్‌ ప్రకారం కన్నప్ప తెలుగు టీజర్‌ మే 30న హైదరాబాద్‌లోని ఓ పాపులర్‌ థియేటర్‌లో స్క్రీనింగ్‌ కానుంది. జూన్‌ 13న టీజర్‌ను డిజిటల్‌గా లాంఛ్‌ చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అక్షరుకుమార్‌ కన్నప్పలో కీ రోల్‌ పోషిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ‘అవ ఎంటర్‌టైన్‌మెంట్‌’ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

➡️