కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కియారా సందడి

May 15,2024 19:10 #Kiara, #New Movies Updates

77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హీరోయిన్‌ కియారా అద్వానీ తొలిసారి సందడి చేయనున్నారు. రెడ్‌ సీ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్యానెల్‌లో ఆమె మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈనెల 14న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 25 వరకూ కొనసాగుతాయి. కాన్స్‌కి మనదేశం తరఫున పలుమార్లు ఐశ్వర్యా రారు ప్రాతినిధ్యం వహించారు. తర్వాత సోనమ్‌ కపూర్‌ కూడా మెప్పించారు. ఈ ఏడాది ఆ అవకాశం కియరా అద్వానీని వరించింది. కాన్స్‌లో వేనిటీ ఫెయిర్‌ హోస్ట్‌ చేస్తున్న ‘రెడ్‌ సీ ఫిల్మ్‌ ఫౌండేషన్‌ ఉమెన్‌ ఇన్‌ సినిమా’ కార్యక్రమంలోనూ పాల్గొంటారు. ప్రపంచ సినిమాకు ప్రోత్సాహకాలు, చిత్రీకరణ, సినిమా నిర్మాణంలో వస్తున్న సాంకేతిక అంశాలపై నాలుగు ప్యానెళ్లలో చర్చలు జరగనున్నాయి. 18న లా ప్లేజ్‌ డెస్‌ పామ్స్‌లో జరగబోయే చర్చల్లోనూ కియారా పాల్గొంటారు.

➡️