కోలీవుడ్‌ దర్శకుడు సినీనటుడు ఎస్‌ఎస్‌ స్టాన్లీ కన్నుమూత

చెన్నై : కోలీవుడ్‌ దర్శకుడు, సినీ నటుడు ఎస్‌ఎస్‌ స్టాన్లీ (58) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘పుదుకొట్టయిరుందు శరవణన్‌’, ‘ఏప్రిల్‌ మంత్‌’, ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్లీ పలు తమిళ హిట్‌ సినిమాల్లోనూ నటించారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీలో ఆయన చివరిసారిగా కనిపించారు.

➡️