‘గేమ్‌ ఛేంజర్‌’ కొండదేవర…

రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి జాతర సాంగ్‌ ‘కొండ దేవర.. కొండ దేవర..’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ‘నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్‌ అందించారు. తమన్‌, శ్రావణ భార్గవి ఆలపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించారు.

➡️