సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ ఈనెల 14న విడుదల కానుంది. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్‌ఫ్లిక్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. క్షణం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు రవికాంత్ పేరపు ఈ చిత్రాన్ని రూపొందించారు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజరురెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్‌కపూర్, షాలినీ వందికట్టి కథానాయికలుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా విడుదల సందర్భంగా కథానాయకుడు రానా దగ్గుపాటి ప్రమోషన్స్ చేశారు. థియేటర్లలో విడుదల సందర్భంగా మళ్లీ ఇప్పుడు మరోసారి ఆయనే ప్రమోట్ చేస్తున్నారు. తన సోషల్‌మీడియాలో ఒక ఫన్నీ వీడియోతో సినిమా విడుదల తేదీని సిద్ధూ ప్రకటించారు. ఈసారి ‘ఇట్స్ కాంప్లికేటెడ్| పేరుతో ఈనెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
