‘కృష్ణమ్మ’ సెకండ్‌ సింగిల్‌ విడుదల

Apr 19,2024 19:30 #movie

హీరో సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాల కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్నారు. అతిరా రాజీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం సెకండ్‌ సింగిల్‌ విడుదల చేశారు. ‘థీమ్‌ ఆఫ్‌ వెంజెన్స్‌’ పేరుతో ఈ సాంగ్‌ విడుదలైంది. ‘చూపుల్లో శూన్యం సుడిలో హృదయం పైపైనే మౌనం ఎదలో మథనం’ అంటూ సాగిన ఈ పాటను అనంత్‌ శ్రీరామ్‌ రాశారు. కాలభైరవ కంపోజిషన్‌లో దీలిపు, కాలభైరవ కలిసి పాడారు. ఈ సినిమాను మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

➡️