శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కుబేర’ చిత్రం నుండి తాజాగా బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ లుక్‌ని విడుదలచేశారు. జిమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పాత్ర లుక్‌ని షేర్ చేశారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
