మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా ‘లెనిన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో అఖిల్ చిత్తూరు కుర్రాడిగా కనిపిస్తారు. శ్రీలీల ఇందులో కథా నాయిక. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ చాలా వరకూ పూర్తయింది. వచ్చే వారం నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్‌ని షూట్ చేయ నున్నారు. ఈ సీక్వెన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సినిమా విడుదల కానుంది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతలు.
