త్వరలో ‘లాక్‌డౌన్‌’ విడుదల

హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్‌డౌన్‌’. ఏఆర్‌ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్‌ నిర్మించింది. టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. కరోనా వైరస్‌ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్‌గానే చూపిస్తారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్‌, లివింగ్‌స్టన్‌, ఇందుమతి, రాజ్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఎన్‌ఆర్‌ రఘునందన్‌, సిద్ధార్థ్‌ విపిన్‌ సంగీతం అందించారు. కెమెరా: వీజే సాబు జోసెఫ్‌.

➡️