ఓటీటీలో ‘విద్యవాసుల అహం’ చూసేయండి

May 15,2024 18:46 #movies, #OTT, #release

ఎవరూ థియేటర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదనీ, ఈ సినిమాను ఎంచక్కా ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి చూసి ఆనందించాలని ‘విద్యవాసుల అహం’ చిత్ర యూనిట్‌ కోరింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం జరిగింది. రాహుల్‌ విజరు, శివాని జంటగా నటించిన చిత్రం ‘విద్య వాసుల అహం’. ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌పై మహేష్‌ దత్తా, లక్ష్మి నవ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. మనికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించారు. ఈనెల 17న నేరుగా ఆహ ఓటీటీ రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మనికాంత్‌ గెల్లి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సినిమా పూర్తిగా కుటుంబ కథా చిత్రమని వివరించారు. అందరి కన్నా ఎక్కువగా కళ్యాణీ మాలిక్‌ సపోర్ట్‌ ఇచ్చారని, ఆయనే హీరోయిన్‌, విష్ణు మూర్తి రోల్‌కి అవసరాల శ్రీనివాస్‌ నటిస్తే బాగుంటుందని సూచించారన్నారు. హీరో రాహుల్‌ మాట్లాడుతూ.. ఇదొక చిన్న క్యూట్‌ ఈగోస్‌ ఉండే ఫన్‌ ఫిలిం అని. సరదాగా హాయిగా సమ్మర్‌లో ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా అని అన్నారు.

➡️