‘గామి’ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా: నాగ్ అశ్విన్  

Feb 12,2024 17:38 #New Movies Updates

మాస్ కా దాస్  విశ్వక్ సేన్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో అందరి ప్రశంసలు అందుకుంది. క్రౌడ్ ఫండ్ తో తెరకెక్కిన ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.  పోస్టర్‌లను ఇష్టపడిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న విశ్వక్ సేన్‌ని అఘోరాగా చూపించాలనే ఆలోచనని అభినందిస్తూ ఈ సినిమా చూడాలనే కోరికను వ్యక్తం చేశారు. ‘చాలా ఓపికగా… చాలా ప్రేమతో.. ఎంతోకాలం శ్రమించి.. సాధించారు. సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచుచూస్తున్నాను.  #గామి మార్చి 8న థియేటర్లలో” అని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు నాగ్ అశ్విన్.

గామి గురించి నాగ్ అశ్విన్ చెప్పిన ఉత్తేజకరమైన మాటలు మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్‌ జోరుని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్న టీంలో గొప్ప విశ్వాసాన్ని నింపాయి.

➡️