ఆశిష్ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా వస్తున్న ‘లవ్ మీ’ చిత్రం విడుదల వాయిదా పడింది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ తేదీని మార్చి, మే 25న ఈ సినిమా విడుదల కాబోతుందని మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
