మేడమ్ సార్ మేడమ్ అంతే’ సాంగ్ విడుదల

Apr 17,2024 20:11 #New Movies Updates, #song release
రావు రమేష్ హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ను ఇవాళ విడుదల చేశారు.

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాలో రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. ఆయన ప్రేమించే అమ్మాయిగా రమ్య పసుపులేటి కనిపించనున్నారు. వాళ్లిద్దరి మీద ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ పాటను తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా అంకిత్ కొయ్య కనిపించనున్నారు. అందుకని, ఆయన అల్లు అర్జున్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ సన్నివేశాలను ఊహించుకుంటూ తన ప్రేమ పాటను పాడుకున్నారు.
➡️