MaheshBabu – ” మీతో నా జీవితం ఒక బ్లాక్‌బస్టర్‌ ” : సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బర్త్‌ డేకు నమ్రత స్పెషల్‌ విషెస్‌

అమరావతి : ” మీతో నా జీవితం ఒక బ్లాక్‌బస్టర్‌ ” అని ప్రిన్స్‌ మహేశ్‌ బాబు భార్య నమ్రత ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. నేడు సూపర్‌ స్టార్‌ ప్రిన్స్‌ మహేశ్‌ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని …. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతోపాటు సినీ రాజకీయ ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు మహేష్‌ బాబు కెరీర్‌లోనే క్లాసిక్‌ మూవీ అయిన మురారి రీరిలీజ్‌ కూడా ఉంది. ఇంకేముంది మహేశ్‌ అభిమానుల సందడితో థియేటర్లు హోరెత్తిపోతున్నాయి. ఎక్కడ చూసినా కేరింతలు, కేకలు సందడే సందడి…! హైదరాబాదులో మల్లికార్జున థియేటర్‌ వద్ద ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. ఏకంగా మహిళలైతే అక్కడే డాన్స్‌ వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్‌ బాబు టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

నమ్రత పోస్టు…
మహేష్‌ బాబు తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్‌ భార్య నమ్రత హార్ట్‌ టచ్చింగ్‌ విషెష్‌ చేసింది. ‘మరొక సంవత్సరం ఎంత అమేజింగో చెప్పడానికి ఈ పుట్టినరోజు మరొక కారణం అయింది. లైఫ్‌ నీతో గడిపేకొద్ది ఇంకా బెటర్‌ అవుతుంది. మీరు అద్భుతమైన వ్యక్తి. మీతో నా జీవితం ఒక బ్లాక్‌బస్టర్‌. హ్యాపీ బర్త్‌ డే నా సూపర్‌ స్టార్‌, నా భాగస్వామి, నా లవ్‌’… అంటూ లవ్‌ సింబల్స్‌ జోడించి నమ్రత రాసుకొచ్చారు.

➡️